ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి,
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని రాజంపేట మండల
జనసేన నాయకులు బద్రి స్వామి ఆధ్వర్యంలో బుధవారం కామారెడ్డి జిల్లాలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, పవన్ కళ్యాణ్ గారికి ఆయురారోగ్యాలు, ప్రజాసేవలో విజయాలు కలగాలని ఆకాంక్షించారు. అనంతరం కామారెడ్డిలోని రెయిన్బో బ్లడ్ సెంటర్‌లో బద్రి స్వామి స్వచ్ఛందంగా రక్తదానం చేసి, క్యాన్సర్ బాధితుల కోసం రక్త యూనిట్‌ను అందజేశారు.