పవన్ కళ్యాణ్ జన్మదినం: జనసేన నాయకుల రక్తదానం

0చూసినవారు
పవన్ కళ్యాణ్ జన్మదినం: జనసేన నాయకుల రక్తదానం
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ 55వ జన్మదినం సందర్భంగా, కామారెడ్డి జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో కేబిఎస్ బ్లడ్ బ్యాంకులో బుధవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. కామారెడ్డి నియోజకవర్గ జనసేన నాయకులు జాజరి దినేష్ కుమార్ నేతృత్వంలో పార్టీ నాయకులు రక్తదానం చేశారు. పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా రక్తదానం చేయడం ఆనందంగా ఉందని, జనసేన పార్టీ తెలంగాణ గడ్డపైనే పుట్టిందని దినేష్ కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్