కామారెడ్డిలో పోలీసుల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ

1చూసినవారు
పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా, శుక్రవారం రాత్రి 7 గంటలకు కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలో న్యూ బస్టాండ్ నుండి నిజాంసాగర్ చౌరస్తా వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని అదనపు ఎస్పీ నరసింహారెడ్డి ప్రారంభించి, అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ సిఐ, ఎస్ఐలు, పోలీసు బృందం పాల్గొన్నారు.