బీబీపేట మండలంలో భారీ వర్షం కారణంగా శ్రీగాధ బ్రిడ్జి వద్ద రోడ్డుపై చెట్లు కూలిపోయాయి. దీనితో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందిన వెంటనే బీబీపేట పోలీస్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని చెట్లను తొలగించారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, వాహనాల రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు చేపట్టారు.