
పెళ్లైన 4నెలలకే యువకుడి ఆత్మహత్య
TG: పెళైన 4నెలలకే అప్పుల బాధ తట్టుకోలేక మొహమ్మద్ అబ్బుబకార్ సిద్ధి(22) అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. HYD పాతబస్తీ ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని క్రిడా రోడ్డులో నివసించే మొహ్మద్కు 4నెలల క్రితం పెళ్లి అయింది. ఆర్థిక లావాదేవీలో దెబ్బ తిన్న సిద్ధికి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. శనివారం అర్ధరాత్రి సమయంలె ఇంట్లో ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. సంఘటన స్థలానికి చేరుకున్న ఐఎస్ సదన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.




