రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం: బీజేపీ నిరసన

3చూసినవారు
తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ ఆదేశాల మేరకు, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సైనికుల పోరాట పటిమ, ఆపరేషన్ సింధూర్, జవాన్ల ధైర్య సహసాలను గురించి వ్యంగ్యాంగా మాట్లాడారని ఆరోపిస్తూ, భారతీయ జనతా పార్టీ బీబీపేట్ మండల అధ్యక్షులు అల్లం ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నక్క రవీందర్, మండల ప్రధాన కార్యదర్శి పిడుగు శ్రీనివాస్, బీజేవైఎం అధ్యక్షులు సంతోష్ రెడ్డి, మండల సీనియర్ నాయకులు, టౌన్ అధ్యక్షులు సూరి సురేష్, గ్రామ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్