జిల్లాలో భూగర్భ జలాలు చాలా వేగంగా పడిపోతున్నయని, ఎండాకాలంలో భూగర్బ జలాల సంరక్షణకు ఫాంపాండ్స్, బోరేవెల్ రీఛార్జ్ స్ట్రక్చర్, ఇంకుడు గుంతలు నిర్మించి, వచ్చే వర్షా కాలంలో ప్రతి వర్షపు నీటి చుక్కను ఒడిసి పట్టి భూమిలోకి ఇంకే లాగా దానికి తగిన విధంగా యాక్షన్ ప్లాన్ చేయాలని సంబంధిత శాఖలకి కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసారు. మంగళవారం కలెక్టరెట్ లో భూగర్భ జలాల సంరక్షణపై సమీక్ష నిర్వహించారు.