ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన చాట్ల సాయికుమార్, గొట్టే శశిధర్ (25) లు శ్రీ చైతన్య స్కూల్ సమీపంలో సిరిసిల్ల - కామారెడ్డి ప్రధాన రహదారిపై వెనుక నుంచి వచ్చిన షిఫ్ట్ డిజైర్ కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు వెంటనే స్పందించి, గాయపడిన ఇద్దరినీ మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.