కామారెడ్డిలో ఘనంగా సర్ధార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి

4చూసినవారు
కామారెడ్డిలో ఘనంగా సర్ధార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి
తెలంగాణతో పాటు 565 సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చూపిన తెగువ స్ఫూర్తిదాయకమని కామారెడ్డి వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సుధాకర్ రావు అన్నారు. శుక్రవారం సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చెట్లు నాటారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ విద్యాసాగర్, కోశాధికారి ప్రొఫెసర్ నాగరాజు, ఆర్కే డిగ్రీ కాలేజ్ సీఈఓ జైపాల్ రెడ్డి, సదాశివనగర్ మాజీ జెడ్పిటిసి పడగల రాజేశ్వర్ రావు, సంపత్ మహేందర్, కానిస్టేబుల్ రవీందర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్