కామారెడ్డి జిల్లా సబ్ జైలుని ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ మిశ్రా, వరంగల్ రేంజ్ డీఐజీ ఆఫ్ ప్రిజన్ ఎమ్ సంపత్ సోమవారం సందర్శించారు. సబ్ జైల్లో ఖైదీల యోగక్షేమాలను, భోజన వసతులు, న్యాయ సేవ, ఆరోగ్య సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. వారి వెంట జిల్లా ఎస్పీ సింధూ శర్మ వున్నారు.