మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన తోకల రాజశేఖర్‌కు జిల్లా కోర్టు జీవిత ఖైదుతో పాటు 50 వేల రూపాయల జరిమానా విధించింది. దేవునిపల్లి పోలీసులు సేకరించిన ఆధారాలతో కామారెడ్డి జిల్లా న్యాయమూర్తి వరప్రసాద్ మంగళవారం ఈ తీర్పు వెలువరించారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా కృషి చేసిన అధికారులను ఎస్పీ రాజేశ్ చంద్ర అభినందించారు.