దోమకొండ మండల కేంద్రంలో విజయ పాల బీఎంసీ కేంద్రాన్ని ఆదివారం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ పునః ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయ డైరీ చైర్మన్ తో మాట్లాడి దొమకొండ మండలానికి 11గ్రామీణ పాల సమీకరణ కేంద్రాలను మంజూరు చేయించానన్నారు. విజయ పాల కేంద్రాల ద్వారా రైతులకు ఎంతో లాభం అన్నారు. రైతుల నుండి నేరుగా గ్రామాల్లోని పాలు సేకరించడం ద్వారా రైతులకు సంపాదన పెరుగుతుందన్నారు.