తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర పిలుపుమేరకు, కామారెడ్డి జిల్లా ముదిరాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గురు నరసింహులు శనివారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ముదిరాజ్ సోదరులకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని, జీవో 6ను వెంటనే అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ప్రతి గ్రామంలో మూడెకరాల భూమిని పండ్ల తోటల పెంపకానికి కేటాయించాలని, చెరువుకుంటల మరమ్మతులు, రిజిస్ట్రేషన్లు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఎక్కువ సంఖ్యలో ముదిరాజ్ లు ఉన్న గ్రామాల్లోని కుంటలను వారికి కేటాయించాలని ఆయన కోరారు.