ముదిరాజ్ కు ప్రత్యేక నిధులు, జీవో 6 అమలు చేయాలి.. నరసింహులు

2చూసినవారు
ముదిరాజ్ కు ప్రత్యేక నిధులు, జీవో 6 అమలు చేయాలి.. నరసింహులు
తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర పిలుపు మేరకు, కామారెడ్డి జిల్లా ముదిరాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గురు నరసింహులు ఒక ప్రకటన విడుదల చేశారు. ముదిరాజ్ సోదరులకు ఇకపై ప్రత్యేక నిధులు కేటాయించాలని, జీవో 6ను వెంటనే అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని శనివారం కోరారు. జీవో అమలుతో పాటు, ప్రతి గ్రామంలో మూడెకరాల భూమిని పండ్ల తోటల పెంపకానికి కేటాయించాలని, చెరువుకుంటల మరమ్మతులు చేపట్టాలని, రిజిస్ట్రేషన్లు సక్రమంగా జరిగేలా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కొన్ని గ్రామాల్లో ముదిరాజ్ జనాభా ఎక్కువగా ఉన్నా, కుంటల వద్ద బెస్తవాలు సభ్యత్వం ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు.

సంబంధిత పోస్ట్