ముదిరాజ్‌లకు ప్రత్యేక నిధులు కేటాయించాలి: కొరివి నర్సింలు

1చూసినవారు
ముదిరాజ్‌లకు ప్రత్యేక నిధులు కేటాయించాలి: కొరివి నర్సింలు
తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర పిలుపుమేరకు, కామారెడ్డి జిల్లా ముదిరాజ్ ప్రధాన కార్యదర్శి కొరివి నర్సింలు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. బీసీడీ గ్రామ సభలలో ముదిరాజ్ లకు ప్రత్యేక నిధులు కేటాయించాలని, జీవో 6ను వెంటనే అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతి గ్రామంలో ముదిరాజ్ లకు మూడు ఎకరాల భూమిని కేటాయించి, దానిపై ఆధారపడి జీవించేలా చూడాలని కోరారు. ఈ డిమాండ్ల సాధనకు ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్