కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ రామకృష్ణ వైదిక ధర్మ పీఠం వేద పాఠశాలలో 13రోజులు చండీ హోమం నిర్వహించడం జరుగుతుంది. ఆదివారం హోమంలో భాగంగా పూర్ణహుతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి నిర్మల్, వేములవాడ, బోధన్, సిద్దిపేట్, హైదరాబాద్, సిరిసిల్ల, కరీంనగర్, నిజామాబాద్, గాంధారి, బాన్సువాడ, పిట్లం నుండి భక్తులు భారీ సంఖ్యలో వచ్చారు.