కామారెడ్డి పట్టణం దేవునిపల్లిలోని శ్రీ మంగళ గౌరీ ఆలయంలో ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా గణపతి పూజ, పుణ్యాహవచనం, దేవతామూర్తులకు అభిషేకం, అర్చన, కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం మహాశివునికి కళశాలు సమర్పించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గణపతి రుద్రహోమం పూర్ణాహుతి, తీర్థ ప్రసాద వితరణ జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ప్రముఖ కళాకారులచే సంగీత, నాట్య ప్రదర్శన, సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం, భజన వంటి కార్యక్రమాలు నిర్వహించబడతాయని, భక్తులు పాల్గొని స్వామి కృపకు పాత్రులు కావాలని ఆలయ అభివృద్ధి కమిటీ విజ్ఞప్తి చేసింది.