ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఎస్పీ

4చూసినవారు
ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఎస్పీ
కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలోని నామినేషన్ కేంద్రాన్ని శుక్రవారం సందర్శించిన ఎస్పీ రాజేశ్ చంద్ర, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఎలాంటి రాజీ ఉండదని, నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించి, బారికేడ్లు, క్యూలైన్లు, పోలీస్ బందోబస్తును పరిశీలించారు. రహదారులపై ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా వాహనాలను నిర్ణీత పార్కింగ్ ప్రదేశాల్లోనే ఉంచాలని సూచించారు.

సంబంధిత పోస్ట్