కామారెడ్డి జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలో మొత్తం 7 బెంచీలతో, జూన్ 14న నిర్వహిస్తున్న లోక్ ఆదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని కామారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి టీ. నాగరాణి గురువారం తెలిపారు. కక్షిదారులు రాజీ పడదగిన కేసులను రాజీ కుదుర్చుకోవాలని కోరారు. లోక్ ఆధాలత్ గోడ ప్రతులను జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్. వివి. ప్రసాద్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు.