ఐవిఎఫ్ ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు: విద్యార్థులకు ఉన్నత లక్ష్యాల సూచన

0చూసినవారు
ఐవిఎఫ్ ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు: విద్యార్థులకు ఉన్నత లక్ష్యాల సూచన
కామారెడ్డి జిల్లాలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్) ఆధ్వర్యంలో పదవ తరగతిలో 550కి పైగా మార్కులు సాధించిన ఆర్యవైశ్య విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆత్మీయ అతిథులు, తెలంగాణ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి కల్వ సుజాత గుప్త, ఐవిఎఫ్ జాతీయ సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్త, జైళ్ల శాఖ హైదరాబాద్ రేంజ్ డీఐజీ డాక్టర్ దుద్దెల శ్రీనివాస్ లు మాట్లాడుతూ, విద్యార్థులు జీవితంలో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటిని సాధించడానికి నిరంతరం కృషి చేయాలని సూచించారు. బట్టీ పద్ధతి కాకుండా అవగాహనతో చదివితేనే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని, మార్కులతో పాటు ఆధ్యాత్మిక భావన, సామాజిక సేవలో భాగస్వామ్యం జీవితాన్ని సంతోషదాయకంగా మారుస్తుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్