కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కర్షక్ బి. ఎడ్ కళాశాలలో ఆదివారం తెలంగాణ అధ్యయన సమాలోచన కేంద్రం (టాస్క్) కామారెడ్డి జిల్లా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా టాస్క్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ఎర్రోజు శ్రీనివాస్ మాట్లాడుతూ, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సమస్యలను ప్రభుత్వాలకు తెలియజేస్తూ సమాజాన్ని చైతన్యవంతం చేయడానికే ఈ సంస్థను ఏర్పాటు చేశామని తెలిపారు. మేధావులు మౌనం వీడి సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో టాస్క్ కార్యవర్గాన్ని ప్రకటించారు.