మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కామారెడ్డికి రానున్నారు. ఆయన వివిధ వార్డుల్లో పార్టీ అభ్యర్థుల తరఫున రోడ్ షోలు, ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారు. మల్లన్న రాకతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది, మున్సిపల్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తామని పార్టీ జిల్లా అధ్యక్షుడు తాహెర్, ప్రధాన కార్యదర్శి బొక్కల సంతోష్ తెలిపారు.