బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాను ప్రభావంతో కామారెడ్డి జిల్లాలో గురువారం జిల్లా కలెక్టరేట్ వర్షపాత వివరాలను విడుదల చేసింది. మాచారెడ్డి మండలంలో అత్యధికంగా 18.3 మి.మీ వర్షం కురిసింది. నాగిరెడ్డిపేటలో 13, జుక్కల్‌లో 10, ఎల్లారెడ్డి మండలంలోని మాచాపూర్‌లో 10 మి.మీ వర్షపాతం నమోదైంది. నస్రుల్లాబాద్ మండలంలో అత్యల్పంగా 3 మి.మీ వర్షం కురిసింది. తుఫాను కారణంగా పలు మండలాల్లో పంట నష్టం వాటిల్లిందని రైతులు తెలిపారు.