ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితాలను పక్కాగా పరిశీలించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం సాయంత్రం ఎంపీడీఓ, ఎంపీఓ, ఆర్డీఓ, మున్సిపల్ కమీషనర్ లతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 18 నుండి 21 వరకు ఇందిరమ్మ కమిటీ సభ్యులు లబ్ధిదారులను పరిశీలించాలని, నిరుపేదలు, మట్టి ఇండ్లు, రేకుల షేడ్, గుడిసెల్లో నివసిస్తున్న వారిని గుర్తించాలన్నారు.