సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లే ప్రజలు తమ ఇళ్లకు రక్షణ కల్పించుకోవడంలో అప్రమత్తంగా ఉండాలని SP రాజేష్ చంద్ర సూచించారు. ఇంటి ముందు, వెనుక భాగాల్లో రాత్రిపూట లైట్లు వెలిగేలా ఏర్పాటు చేసుకోవాలని, బంగారు ఆభరణాలు, నగదును వెంట తీసుకెళ్లడం లేదా బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవడం ఉత్తమమని తెలిపారు. అనుమానిత వ్యక్తులు లేదా కొత్తవారు సంచరిస్తున్నట్లు కనిపిస్తే వెంటనే 100కి కాల్ చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.