రామారావును హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

7చూసినవారు
రామారావును హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి
ఖమ్మం జిల్లాలో సీపీఎం పార్టీ రాష్ట్ర నాయకులు సామినేని రామారావు హత్య ఘటనపై సీపీఎం పార్టీ కామారెడ్డి జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నిన్న తెల్లవారుజామున ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు గ్రామాల్లో కాంగ్రెస్ మూకల కిరాయి గుండాలు రామారావును అత్యంత కిరాతకంగా హత్య చేశారని ఆయన ఆరోపించారు. అనేక ప్రజా ఉద్యమాలకు, రైతాంగ ఉద్యమాలకు నాయకత్వం వహించిన రామారావు హత్యతో ప్రజా ఉద్యమాలను ఆపలేరని ఆయన అన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ట్యాగ్స్ :