గణపతి నిమజ్జనానికి బీబీపేట్ లో పటిష్ట ఏర్పాట్లు

561చూసినవారు
గణపతి నిమజ్జనానికి బీబీపేట్ లో పటిష్ట ఏర్పాట్లు
కామారెడ్డి జిల్లా బీబీపేట్ గ్రామంలో గణపతి నిమజ్జనం సందర్భంగా మంగళవారం గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. మాంకాలమ్మ టెంపుల్ నుండి చెరువు వరకు రహదారిని జేసీబీతో శుభ్రం చేయించి, నిమజ్జన మార్గంలో కొత్త విద్యుత్ స్తంభాలు, వీధి దీపాలు ఏర్పాటు చేశారు. పాలకవర్గ సభ్యులు పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. భక్తులు, గ్రామ ప్రజలు నిమజ్జన కార్యక్రమంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్