పెళ్లి వేళ విషాదం: కల్వర్టును ఢీకొన్న కారు, 8 మందికి గాయాలు

బుధవారం కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి గ్రామం సమీపంలో పెట్రోల్ పంప్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి కొడుకు తల్లిదండ్రులు, సోదరి, ముగ్గురు చిన్నారులతో సహా 8 మందితో కారులో ఫంక్షన్ హాల్‌కు వెళుతుండగా, కారు రోడ్డు పక్కన ఉన్న కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా, పెళ్లి కొడుకు తల్లిదండ్రులతో పాటు మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే కామారెడ్డి జిజిహెచ్ ఆసుపత్రికి తరలించారు. పెళ్లి వేడుకకు కొద్దిసేపటి ముందు జరిగిన ఈ సంఘటన కుటుంబ సభ్యులను తీవ్ర దుఃఖంలో ముంచెత్తింది.
