పర్యావరణ పరిరక్షణకు విరివిగా మొక్కలు నాటాలని ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్ పిలిపునిచ్చారు. ఆదివారం కామారెడ్డి జిల్లా భిక్నూర్ మండలం భగీరతిపల్లిలో అటవీ శాఖ ఆధ్వర్యంలో వనమహోత్సవంలో పాల్గొని మాట్లాడుతూ జీవనానికి హరిత పర్యావరణం కీలకమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థల అధ్యక్షుడు చంద్రకాంత్ రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి బి. ఇంద్రకరణ్ రెడ్డి, అటవీ శాఖ రేంజ్ అధికారి వి. రమేష్ ఉన్నారు.