లింగంపేట్ లో టీఆర్ఎస్ పార్టీకి కొత్త అధ్యక్షులు నియామకం

363చూసినవారు
లింగంపేట్ లో టీఆర్ఎస్ పార్టీకి కొత్త అధ్యక్షులు నియామకం
కామారెడ్డి జిల్లా, లింగంపేట్ మండలం మాలోత్ సంగ్యనాయాక్ గ్రామంలో టీఆర్ఎస్ పార్టీకి కొత్త అధ్యక్షులు, ఉపాధ్యక్షులను శుక్రవారం నియమించారు. కొర్ర రమేష్ అధ్యక్షుడిగా, నేనావత్ సంతోష్ ఉపాధ్యక్షుడిగా, మాలావత్ రమేష్ యూత్ అధ్యక్షుడిగా, కొర్ర మున్య యూత్ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సుమారు 40 మంది వివిధ పార్టీల కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరారు. ఈ కార్యక్రమంలో పోకల సాయిరాం, ప్రతాప్ రెడ్డి, దేగావత్ జైల్ సింగ్, గోవర్ధన్ రెడ్డి, సాయిలు, బద్రు, మహేం తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్