కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని అమర్లబండ గ్రామంలో టీఆర్‌ఎస్ పార్టీ గ్రామ కమిటీ
ఎన్నికలు ఆదివారం పండుగ వాతావరణంలో జరిగాయి. ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇంచార్జ్ ఎదురుగట్ల సంపత్ గౌడ్ ఆదేశాల మేరకు, మండల అధ్యక్షుడు సాయగౌడ్ ఆధ్వర్యంలో గ్రామ శాఖకు నూతన అధ్యక్షుడిగా గుండెల్లి సాయికుమార్, ఉపాధ్యక్షుడిగా పర్దీ పెట్ దినేష్, ప్రధాన కార్యదర్శిగా న్యాలపురం రజనీకాంత్, కార్యదర్శిగా న్యాలపురం మోహన్, కోశాధికారిగా గుండెల్లి రవీందర్, సలహాదారుగా న్యాలపురం రమేష్ ఎన్నికయ్యారు. యువత కమిటీ అధ్యక్షుడిగా పర్దీ పెట్ రావణ్, ఉపాధ్యక్షుడిగా సంగనోల్ల మహేష్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా గుండెల్లి సతీష్, కార్యదర్శిగా న్యాలపురం శేఖర్, కోశాధికారిగా న్యాలపురం రంజిత్, సలహాదారులుగా పర్దీపెట్ అఖిల్ ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన వారికి మండల అధ్యక్షుడు సాయగౌడ్ పార్టీ కండువాలు కప్పి బాధ్యతలు అప్పగించారు.