రోడ్లపై వాహనాలు నిలిపిన ఇద్దరికి జరిమాన

6చూసినవారు
రోడ్లపై వాహనాలు నిలిపిన ఇద్దరికి జరిమాన
కామారెడ్డి పట్టణంలో ప్రజా రవాణాకు ఆటంకం కలిగించేలా రోడ్లపై వాహనాలు నిలిపిన రెండు వాహనాల యజమానులపై పోలీసులు కేసు నమోదు చేశారు. సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా, ఒక్కొక్కరికి రూ.2000 చొప్పున జరిమానా విధించినట్లు కామారెడ్డి టౌన్ సీఐ నరహరి తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

ట్యాగ్స్ :