విద్య సంస్థల్లో అసురక్షిత నిర్మాణాలను కూల్చివేయాలి

2చూసినవారు
విద్య సంస్థల్లో అసురక్షిత నిర్మాణాలను కూల్చివేయాలి
పాఠశాలలు, కళాశాలలు, కేజీబీవిలలో అసురక్షిత నిర్మాణాలను కూల్చివేయాలని, పరిశుభ్రత పాటించాలని విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో, పెయింటింగ్ పురోగతిని సమీక్షించి, సమయపాలన పాటించేలా చూడాలని సూచించారు. కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ నుండి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, అదనపు కలెక్టర్ విక్టర్ రెవెన్యు, డీఈఓ రాజు, ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కార్యదర్శి స్పష్టం చేశారు.