అక్రమాలను అరికట్టి అభివృద్ధి చేశాం: ఎమ్మెల్యే

2చూసినవారు
అక్రమాలను అరికట్టి అభివృద్ధి చేశాం: ఎమ్మెల్యే
రెండేళ్ల పాలనలో కామారెడ్డి మున్సిపాలిటీలో అక్రమాలను అరికట్టి అభివృద్ధి చేశామని, ఆస్తి పన్ను ఆదాయం రూ.6 కోట్ల నుంచి రూ.11 కోట్లకు పెరిగిందని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి తెలిపారు. కరెంట్ బిల్లులు, పీఎఫ్, ఈఎస్ఐ బకాయిలు చెల్లించామని, నకిలీ బిల్లులను అడ్డుకున్నామని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి పనులకు నిధులు తెచ్చిందన్న ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ వ్యాఖ్యలను అవాస్తవమని విమర్శించారు.

సంబంధిత పోస్ట్