కామారెడ్డి జిల్లా కేంద్రంలో కోతుల ఆగడాలు మితిమీరుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఇంట్లో బియ్యం, పప్పులు దొంగిలించే కోతులు, ఇప్పుడు ఏకంగా కోడి గుడ్లను దొంగిలించి తినేస్తున్నాయి. మంగళవారం ఒక కిరాణా షాపులోకి చొరబడిన కోతి రెండు కోడి గుడ్లను ఎత్తుకెళ్లి, పగులగొట్టి గుడ్డు సొనను తాగేసింది. ఈ సంఘటనతో గుడ్ల వ్యాపారులు కోతులనుండి తమ సరుకును కాపాడుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.