కామారెడ్డి జిల్లా కేంద్రంలోని యోగ భవసన్ లో ఈ నెల 29నుండి డిసెంబర్ 1వరకు విద్యార్థులకు యోగా పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్య శాఖ అధికారి రాజు తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ అండర్ -14 బాల బాలికల విభాగంలో వేరువేరుగా పోటీలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల బాల బాలికలు ఈ పోటీలకు హాజరై విజయవంతం చేయాలని కోరారు.