యువత సన్మార్గంలో నడవాలి

6చూసినవారు
యువత సన్మార్గంలో నడవాలి
నేటి యువత అనేక చెడు మార్గాల వైపు వెళుతూ తమ బంగారు భవిష్యత్తును అంధకారం చేసుకుంటుందని, అలా కాకుండా సన్మార్గంలో నడుస్తూ అటు దేశ అభివృద్ధికి, ఇటు సమాజాభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని ఆర్టిఐ బీబీపేట మండల అధ్యక్షులు, కామారెడ్డి జిల్లా అడ్వైజర్ ఎం. నాంపల్లి తెలిపారు. బీబీ పేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, యువత మత్తు పానీయాలు, గుట్కా, తంబాకు, సిగరెట్, గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వైపు వెళ్లకుండా మంచి మార్గంలో, నడవాలని, వారి జీవితాలను, బంగారమయం చేసుకోవాలని యువతకు పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్