Oct 25, 2025, 18:10 IST/
సొంత కుటుంబంపై కవిత ఆరోపణలు.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఫిర్యాదు
Oct 25, 2025, 18:10 IST
TG: మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావులే టార్గెట్గా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇటీవల సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కేసీఆర్ పక్కన ఉండేవాళ్ల వల్లనే ఆయనకు అవినీతి మరక అంటిందని ఆరోపించారు. అయితే బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవకతవకలపై సెప్టెంబర్ 2న కవిత చేసిన ఆరోపణలపై కేసు నమోదు చేసి విచారణ చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫిర్యాదు చేశారు. శనివారం హైదరాబాద్లోని నారాయణగూడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు.