అధికార లాంఛనాలతో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య అంత్యక్రియలు

1631చూసినవారు
అధికార లాంఛనాలతో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య అంత్యక్రియలు
విధి నిర్వహణలో భాగంగా తనిఖీలు నిర్వహిస్తున్నప్పుడు గంజాయి స్మగ్లర్ల దాడిలో గాయపడి మృతి చెందిన నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ కానిస్టేబుల్ కుమారి గాజుల సౌమ్య (24) అంత్యక్రియలను ఆదివారం ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికార లాంఛనాలతో నిర్వహించారు. హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి చెందిన సౌమ్య పార్థివదేహం ఆదివారం సాయంత్రం ఆమె స్వస్థలమైన నిజామాబాద్ జిల్లా మోస్రా మండల కేంద్రానికి చేరుకుంది. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారులు పి. సుదర్శన్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావు, కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ ఖురేషి, డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి, సూపరింటెండెంట్ మల్లారెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ తదితరులు ఈ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్