స్పృహ తప్పిన మాజీ ఎమ్మెల్యే

899చూసినవారు
స్పృహ తప్పిన మాజీ ఎమ్మెల్యే
ఆర్మూర్ నియోజకవర్గ కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి చేరుకొని ర్యాలీ నిర్వహించారు. పార్టీ జెండాలు, నినాదాలతో పట్టణ వీధుల్లో ఊరేగింపుగా సాగిన ఈ నిరసన ర్యాలీ అంబేద్కర్ చౌరస్తాకు చేరుకుంది.

సంబంధిత పోస్ట్