నగరంలోని సుభాష్‌నగర్‌కు చెందిన అనురాగ్(18) సోమవారం అర్ధరాత్రి మాధవనగర్ వద్ద బైక్ అదుపుతప్పి పడిపోవడంతో తలకు తీవ్ర గాయాలైంది. స్థానికులు సమాచారం అందించడంతో 108 సిబ్బంది అతడిని సమీప ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు. మాధవనగర్ శివారులోని రైల్వే ట్రాక్ వద్ద జరుగుతున్న ఆర్వోబీ నిర్మాణ ప్రాంతంలో రాత్రివేళల్లో లైట్లు లేకపోవడంతో చిమ్మచీకట్లు అలుముకుంటున్నాయని, దీనివల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వార్తలో పేర్కొన్నారు. 6వ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.