పేకాట స్థావరంపై పోలీసుల దాడి

1362చూసినవారు
పేకాట స్థావరంపై పోలీసుల దాడి
బోధన్ మండలంలోని అమ్లాపూర్ శివారులో పేకాట స్థావరంపై సీసీఎస్ పోలీసులు బుధవారం సాయంత్రం దాడి చేశారు. ఈ దాడిలో ఏడుగురు పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 5,250 నగదు, 8 సెల్ఫోన్లు, 4 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు సీసీఎస్ సీఐ సాయినాథ్, ఎస్సై విఠల్ తెలిపారు. తదుపరి చర్యల కోసం వారిని బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు.

సంబంధిత పోస్ట్