
'గెలిపిస్తే కళ్యాణి గ్రామాభివృద్ధికి సంపూర్ణ కృషి'
తనను గెలిపిస్తే సంపూర్ణ గ్రామాభివృద్ధికి కృషి చేస్తా అని ఎల్లారెడ్డి మండలం కళ్యాణి గ్రామ సర్పంచ్ అభ్యర్థి చినబాలి రత్నమాల సామెల్ అన్నారు. గతంలో సర్పంచ్ గా చేసిన అభివృద్ధి, తన భర్త సామెల్ జడ్పిటీసిగా గ్రామాభివృద్ధికి చేసిన కృషిని వివరిస్తూ శుక్రవారం సాయంత్రం ఎన్నికల నిబంధనల మేరకు ప్రచారం నిర్వహించి, సమయం కావడంతో ప్రచారం ఆపేసారు.
















