కామారెడ్డిలో డ్రంక్ అండ్ డ్రైవ్ 10కేసులు

0చూసినవారు
తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి జిల్లా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో అగ్రస్థానంలో నిలుస్తోంది. శుక్రవారం ఒక్కరోజే నిజాంసాగర్ చౌరస్తా, ట్రాఫిక్ సిగ్నల్ చౌరస్తాల్లో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 10 మందిని గుర్తించి, వారిపై కేసులు నమోదు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ విభాగం పోలీసులు ఈ వివరాలను వెల్లడించారు. ఇప్పటికే జిల్లాలో వందలాది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి, నిందితులకు కోర్టుల ద్వారా శిక్షలు పడుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్