కొండపూర్ గ్రామ ప్రాథమిక పాఠశాలకు 12లక్షల నిధులు మంజూరు

1చూసినవారు
కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం కొండపూర్ గ్రామ ప్రాథమిక పాఠశాలలో టాయిలెట్ల నిర్మాణానికి రూ. 12 లక్షల నిధులు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే మదన్ మోహన్ కు గ్రామస్తులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాలలో టాయిలెట్ సౌకర్యాల లేమి విద్యార్థులకు, ముఖ్యంగా బాలికలకు ఇబ్బందులు కలిగిస్తుందని, ఈ సమస్యను గుర్తించి ఎమ్మెల్యే నిధులు మంజూరు చేయడం విద్యార్థుల ఆరోగ్యం, పారిశుద్ధ్యం, విద్యాభివృద్ధి పట్ల ఆయన నిబద్ధతను తెలియజేస్తుందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్