గొర్తి ఈశ్వర ట్రస్ట్ ద్వారా విద్యార్థికి 15,000 ప్రోత్సాహకం

0చూసినవారు
గొర్తి ఈశ్వర ట్రస్ట్ ద్వారా విద్యార్థికి 15,000 ప్రోత్సాహకం
కామారెడ్డిలో గొర్తి ఈశ్వర ట్రస్ట్ ఆధ్వర్యంలో 2025-26 విద్యా సంవత్సరంలో టెన్త్ లో అత్యధిక మార్కులు సాధించిన నాగిరెడ్డిపేట్ మండలంలోని జెడ్పిహెచ్ఎస్ గోపాల్ పేట పాఠశాల విద్యార్థి మనోహర్‌కు 15,000 రూపాయల ప్రోత్సాహక బహుమతిని అందజేశారు. ట్రస్ట్ అధ్యక్షులు పవన్ కుమార్, వారి సతీమణి ఉషాబాల గతంలో ఈ మండలంలో సేవలందించారు. ప్రస్తుతం కాశీలో నివాసం ఉంటున్న వీరు, ప్రతి సంవత్సరం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పాఠశాలల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్