కళ్యాణివాగు పై 2. 50కోట్లతో జరుగుతున్న వంతెన పనులు

6చూసినవారు
ఎల్లారెడ్డి మండలంలోని కళ్యాణిగ్రామ కళ్యాణి వాగుపై బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మంజూరు అయిన వంతెన పనులు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు శంకుస్థాపనతో జోరుగా సాగుతున్నాయి. ఈ వంతెన నిర్మాణంతో రైతులకు, రత్నపూర్, కొక్కొండ గ్రామస్థులకు రహదారి ఇబ్బందులు తొలగిపోతాయి. కళ్యాణి గ్రామానికి చెందిన రైతుల పంటలు వాగు అవతలి వైపు ఉండటంతో, వాగు వచ్చినప్పుడు రహదారి మూతపడి ప్రజలు ఇబ్బందులకు గురవుతుంటారు. దాదాపు వందేళ్ల కల వంతెన నిర్మాణంతో తీరబోతుంది. బుధవారం అధికారులు పనులు పరిశీలించారు.

సంబంధిత పోస్ట్