లింగంపేట్ - ఎల్లారెడ్డి ప్రధాన రహదారిలో వన్యప్రాణుల సంచారం ప్రయాణికుల్లో భయాందోళనలు రేకెత్తిస్తోంది. ఇప్పటికే చిరుతపులి భయం వెంటాడుతుండగా, తాజాగా గురువారం రాత్రి 7:30 గంటలకు మిద్దె మెట్టు దర్గా సమీపంలో మూడు ఎలుగుబంట్లు రహదారి పక్కన కనిపించాయి. దీంతో నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో రాత్రి వేళల్లో ప్రయాణించడానికి వాహనదారులు భయపడుతున్నారు.