నాగిరెడ్డిపేట మండలంలోని తాండూర్ గ్రామ శివారులో ఉన్న మంజీర నది ఒడ్డున వెలసిన అతిపురాతన మహిమాన్విత త్రిలింగ రామేశ్వర ఆలయ ఉండి లెక్కింపు చేసినట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు కొమ్మ దత్తు తెలిపారు. ఆలయం యొక్క ఆరు నెలల ఆదాయం 34 వేల రూపాయలు వచ్చిందని, అలాగే హుండీలో 1,25,000 రూపాయల విలువైన బంగారు గొలుసును ఒక అజ్ఞాత భక్తుడు వేసినట్లు వెల్లడించారు. రానున్న శివరాత్రి ఉత్సవాల ఏర్పాట్ల నిమిత్తం గ్రామస్తులు, పరిసర గ్రామ ప్రజలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, జాతర ఏర్పాట్లను చర్చించారు.