అక్రమంగా తరలిస్తున్న 48 కిలోల గంజాయి పట్టివేత

2చూసినవారు
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్లో నాగవల్లి ఎక్స్ ప్రెస్ రైలులో తరలిస్తున్న 48 కిలోల గంజాయిని ఎక్సైజ్ శాఖ పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి పూణేకు తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఘటనలో రోహిత్ (21) అనే యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు 24 లక్షల రూపాయల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :